తెలంగాణ

telangana

ETV Bharat / international

'లైట్​ షో': డ్రోన్లతో ప్రదర్శన.. వీక్షకులకు కనువిందు

చైనాలో 'మిడ్ ఆటమ్'​ ఫెస్టివల్ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా 300 డ్రోన్లతో ప్రత్యేక లైట్​ షో నిర్వహించారు. జిగేల్​ మనిపించే వెలుగులు, ఆకాశంలో విన్యాసాలు వీక్షకులకు కనువిందు కలిగించాయి. గాల్లో కుందేలు, బుద్ధుడి రూపాల సృష్టి వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

'లైట్​ షో': డ్రోన్లతో ప్రదర్శన.. వీక్షకులకు కనువిందు

By

Published : Sep 15, 2019, 5:17 AM IST

Updated : Sep 30, 2019, 3:53 PM IST

'లైట్​ షో': డ్రోన్లతో ప్రదర్శన.. వీక్షకులకు కనువిందు

చైనాలోని అన్​హూయ్, సిచాన్ రాష్ట్రాల్లో శుక్రవారం డ్రోన్లతో చేసిన విన్యాసాలు మైమరిపించాయి. 'మిడ్ ఆటమ్' ఫెస్టివల్ సందర్భంగా డ్రోన్ల సమూహంతో, జిగేల్​మనిపించే వెలుగులతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. చైనా సంప్రదాయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇందుకోసం దాదాపు 300 డ్రోన్లను ఉపయోగించారు. కుందేలు, బుద్ధ భగవాన్ లాంటి అబ్బురపరిచే రూపాలను గాలిలో సృష్టించారు. ఉత్సవంలో పాల్గొన్న వేలాది మంది వీక్షకులు ఈ దృశ్యాలను కనులారా చూసి తరించారు.

Last Updated : Sep 30, 2019, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details