చైనాలో లేకిమా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. 187 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ప్రచండ గాలులతో తూర్పు చైనా వణికిపోతోంది. భారీ వర్షాల కారణంగా 33 మంది మరణించారు. మరో 16 మంది గల్లంతయ్యారు.
జెజియాంగ్ రాష్ట్రంలోని వెన్జౌ నగరంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. పలువురి ఆచూకీ గల్లంతయింది. జెజియాంగ్, జియాంగ్సు రాష్ట్రాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.