తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంగ్​కాంగ్ ఉద్యమ సారథి వాంగ్​ అరెస్టు - wong

హాంగ్​కాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమ సారథి జోషువా వాంగ్​ను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి నిరాకరించినా శనివారం భారీ ర్యాలీ చేసేందుకు నిరసనకారులు సిద్ధమైన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వాంగ్​ను అదుపులోకి తీసుకున్నారు.

హాంగ్​కాంగ్ ఉద్యమ సారథి వాంగ్​ అరెస్టు

By

Published : Aug 30, 2019, 10:14 AM IST

Updated : Sep 28, 2019, 8:17 PM IST

హాంగ్​కాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమ ముఖ్య నేత జోషువా వాంగ్​ అరెస్టయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వాంగ్​ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వాంగ్ పార్టీ 'డెమోసిస్టో' ట్విట్టర్​లో వెల్లడించింది.

హాంగ్​కాంగ్​లో గత మూడు నెలలుగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు.

శనివారం భారీ ర్యాలీ నిర్వహించాలని యువ నిరసనకారులు భావించారు. అందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. ముందు జాగ్రత్త చర్యగా వాంగ్​ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హింసాత్మక ఘటనలు జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: బ్రెజిల్​: అడవుల కాల్చివేతపై 60 రోజుల నిషేధం

Last Updated : Sep 28, 2019, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details