తెలంగాణ

telangana

ETV Bharat / international

లంకలో నాడు మారణకాండ- నేడు మత ఘర్షణలు - కర్ఫ్యూ

వరుస బాంబు పేలుళ్ల ఉదంతం మరువకముందే మత ఘర్షణలతో శ్రీలంక మరోమారు వార్తల్లో నిలుస్తోంది. దేశవ్యాప్తంగా మతపరమైన అల్లర్లు పెరిగిపోవడం వల్ల తరచూ కర్ఫ్యూలు విధిస్తోంది శ్రీలంక ప్రభుత్వం. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిపై కఠినంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించింది. సోమవారం జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతిచెందారు.

శ్రీలంకలో కర్ఫ్యూ: నాడు మారణకాండ- నేడు మత ఘర్షణలు

By

Published : May 14, 2019, 6:01 AM IST

Updated : May 14, 2019, 8:13 AM IST

నాడు మారణకాండ- నేడు మత ఘర్షణలు

ఈస్టర్​ సండే వరుస బాంబు పేలుళ్ల మారణహోమంతో అస్తవ్యస్తమైన శ్రీలంక ప్రస్తుతం మత ఘర్షణలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మతపరమైన అల్లర్లు పెరగడం వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లోసోమవారం6 గంటల పాటు కర్ఫ్యూ విధించింది శ్రీలంక ప్రభుత్వం. నిబంధనలను ఉల్లఘించినవారిపై 'కనిపిస్తే కాల్చివేత'​ ఆదేశాలు జారీ చేసింది.

"సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని భద్రతా దళాలకు సూచించాం. షూట్​ ఎట్​ సైట్​ ఆదేశాలతో వారు సిద్ధంగా ఉన్నారు."
-- మహేష్​ సేననాయకే, సైన్యాధిపతి.

శ్రీలంకలోని వాయవ్య ప్రాంతాలైన కులియపిటియా, బింగీరియా, దుమ్మలసూరియా, హిట్టపొ నగరాల్లో కర్ఫ్యూ విధించారు అధికారులు. సోమవారం జరిగిన మత ఘర్షణల్లో ఒకరు మృతిచెందారు.

హింసాత్మక ఘటనల దృష్ట్యా సోమవారం దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలను నిషేధించింది శ్రీలంక ప్రభుత్వం.

శాంతియుతంగా ఉండాలని, అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను అభ్యర్థించారు ప్రధాని విక్రమసింఘే.

ఇదీ చూడండి: చిన్నారి వైద్యానికి.. ప్రియాంక ప్రత్యేక విమానం

Last Updated : May 14, 2019, 8:13 AM IST

ABOUT THE AUTHOR

...view details