తెలంగాణ

telangana

ETV Bharat / international

కుక్క మాంసంపై రగడ- పోటాపోటీ నిరసనలు

దక్షిణ కొరియన్లు కుక్కమాంసం తినడానికి అమితంగా ఆసక్తి చూపుతుంటారు. అయితే కొంత మంది నిరసనకారులు ఈ శునక భక్షణపై నిషేధం విధించాలంటూ ఆ దేశ చట్టసభ ఎదుట నిరసన చేపట్టారు. మరో వర్గం అందుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది.

'కుక్క మాంసం నిషేధింపు చట్టానికై పోరాటం'

By

Published : Jul 12, 2019, 3:52 PM IST

'కుక్క మాంసం నిషేధింపు చట్టానికై పోరాటం'

దేశంలో కుక్కల మాంసాన్ని నిషేధించాలని సియోల్​లో జాతీయ అసెంబ్లీ ఎదుట కళేబరాలతో నిరసనకు దిగారు దక్షిణ కొరియన్లు. ఈ నిరసనల్లో ప్రముఖ నటి కిమ్​ బాసింగర్​ పాల్గొన్నారు. వ్యాపారం కోసం కుక్కలను హత్య చేయటాన్ని నియంత్రించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

కనీసం చాబొక్​ పండగ రోజైనా వీటిపై నిషేధం ఉండాలని డిమాండ్​ చేశారు.

"అవి మాట్లాడలేవు. భూమిపై మనం ఈ హింసను ఆపెయ్యాలి. ఈ కుక్కలు, పిల్లులకు వీలైతే సాయం చేయాలి."

-బాసింగర్​, నటి

చాబొక్​...కొరియాలో అత్యంత వేడిగా ఉండే నెల ప్రారంభమయ్యే రోజు. ఆ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. ఇందులో భాగంగా చాబొక్​ను పురస్కరించుకుని మూడు రోజులు కుక్క మాంసం అధికంగా తింటారు ఇక్కడి ప్రజలు.

పోటీగా....

రెస్టారెంట్లకు కుక్క మాంసం సరఫరా చేసేవారు వీరికి పోటీకి నిరసన చేపట్టారు. కుక్క మాంసాన్ని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: ప్రకృతికి ప్రతిరూపాలు ఈ కళాఖండాలు

ABOUT THE AUTHOR

...view details