తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీరీల కోసం ఎందాకైనా వెళ్తాం:పాక్ సైన్యం - ఆర్మీ

జమ్ముకశ్మీర్​కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ ఆర్మీ స్పందించింది. కశ్మీరీలకు చేయూతగా నిలిచేందుకు ఎందాకైనా వెళ్తామని స్పష్టం చేసింది.

'కశ్మీరీలకు సహాయం చేసేందుకు ఎంతదాకానైనా వెళ్తాం'

By

Published : Aug 6, 2019, 6:55 PM IST

కశ్మీరీలకు సహాయం చేసేందుకు ఎందాకైనా వెళ్తామని పాక్ ఆర్మీ ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దుపై స్పందించింది పాక్ సైన్యం. కశ్మీర్ అంశమై ఆర్మీ ప్రధాన కార్యాలయంలో పాక్ సైన్యం ప్రధాన అధికారులు సమావేశమయ్యారు.

"పాకిస్థాన్​ ఆర్మీ కశ్మీరీలకు చేయూతగా ఉండే అంశంలో స్థిరంగా నిలబడతాం. మా లక్ష్యం కోసం ఎంతదాకానైనా వెళ్తాం."

-జనరల్ ఖమార్ జావేద్ భజ్వా, పాక్ ఆర్మీ చీఫ్

కశ్మీర్​కు సంబంధించి భారత చర్యలను తిరస్కరిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పాక్ ఆర్మీ తన ప్రకటనలో గుర్తు చేసింది. ఆర్టికల్-370, ఆర్టికల్ 35ఏలను పాకిస్థాన్ ఎప్పుడూ గుర్తించలేదని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: కశ్మీర్​పై మోదీ హిట్​... కాంగ్రెస్​ 'హిట్​ వికెట్'

ABOUT THE AUTHOR

...view details