ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నట్లు దక్షిణ కొరియా అధికారి ఒకరు వెల్లడించారు. తన సోదరి కిమ్ యోంగ్ ఉన్‌కు కొన్ని అధికారాలు కట్టబెట్టిన అనంతరం ఆయన ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డై జంగ్ సహచరుడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
'కోమాలోకి ఉత్తర కొరియా అధినేత కిమ్' - కోమాలోకి కిమ్ జోంగ్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లినట్లు దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడి సహచరుడు వ్యాఖ్యానించారు. కొంతకాలంగా కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
'కోమాలోకి వెళ్లిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్'
కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తాయి. తీవ్రంగా జబ్బుపడి మరణించారన్న కథనాలు కూడా వచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత ఓ ఫ్యాక్టరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయినప్పటికీ ఈ వదంతులకు అడ్డుకట్టపడలేదు. కిమ్ సోదరి ఆయన తరపున అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.