తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​ అసెంబ్లీలో 'హిందూ' రగడ - ఇద్దరు వాకౌట్​

పాకిస్థాన్​లోని ఖైబర్ పక్తుంఖ్వా రాష్ట్ర అసెంబ్లీలో హిందువులు తమ శత్రువులని వ్యాఖ్యానించాడు పాకిస్థానీ పీపుల్స్ పార్టీ నేత షేర్ ఆజం. ఆయన వ్యాఖ్యలపై నిరసిస్తూ సభలో ఉన్న హిందూ సభ్యులు రవికుమార్, రంజిత్ సింగ్ వాకౌట్ చేశారు. అనంతరం తన వ్యాఖ్యలకు ఆజం క్షమాపణలు చెప్పారు.

పాక్ అసెంబ్లీలో 'హిందూ' రగడ- ఇద్దరు వాకౌట్

By

Published : Mar 20, 2019, 9:50 PM IST

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్​పై విద్వేషాన్ని వెల్లగక్కుతూనే ఉన్నారు పాకిస్థాన్ నేతలు. పెషావర్ రాష్ట్ర రాజధానైన ఖైబర్ పక్తుంఖ్వా అసెంబ్లీలో 'పాకిస్థాన్ పీపుల్స్' పార్టీకి చెందిన షేర్ ఆజం అనే మంత్రి 'హిందువులు మన దేశానికి శత్రువులు' అని వ్యాఖ్యానించారు. దీనిపై శాసనసభ్యులు రవికుమార్, రంజిత్​ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం తన వ్యాఖ్యలకు ఆజం క్షమాపణలు చెప్పారు. హిందువులకు బదులుగా హిందుస్థాన్​ పదం వాడి ఉండాల్సిందని ఆజం వివరణిచ్చారు.

నిరసన తెలుపుతూ వాకౌట్​ చేసిన ఇద్దరిని అసెంబ్లీ సభ్యులు వెనక్కి తీసుకొచ్చారు. స్పీకర్ ముస్తాక్ ఘనీ మంత్రి ఆజం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details