పాకిస్థాన్ ప్రథమ ప్రాధాన్యం కశ్మీరే అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. మంగళవారం తన మంత్రివర్గంతో సమావేశమైన ఇమ్రాన్.. సెప్టెంబర్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తాలని నిర్ణయించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు. అదే సమయంలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, భారత్‌ను ఇరుకున పెట్టాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఇమ్రాన్‌ఖాన్ ప్రత్యేక కార్యదర్శి ఫిర్దౌస్ ఆశిక్ అవన్ స్పష్టం చేశారు. కశ్మీర్లో భారత్ విధించిన ఆంక్షలను ఎత్తివేయకపోతే.. అంతర్జాతీయ వేదికల్లో ఆ అంశాన్ని తప్పక ప్రస్తావిస్తామని ఆమె స్పష్టం చేశారు.
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్లాలని పాక్ నిర్ణయించుకుందని ఫిర్దౌస్ ఆశిక్ అవన్ తెలిపారు.