కర్తార్‌పుర్ నడవా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నవంబర్ 9 నుంచి కారిడార్ ద్వారా పాకిస్థాన్‌లోని సిక్కుల పుణ్యక్షేత్రానికి భక్తులను అనుమతించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
కర్తార్‌పుర్ నడవా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు - సిక్కుల పుణ్యక్షేత్రం
నవంబర్ 9న కర్తార్‌పుర్ నడవాను ప్రారంభించనున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. అక్టోబర్ నెలాఖరుకల్లా ఈ నడవాకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయని స్పష్టం చేసింది.
విదేశీ, స్థానిక పాత్రికేయులు ఈ కారిడార్‌ను సందర్శించిన సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆతిఫ్ మజిద్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటివరకు 86శాతం పనులు పూర్తయ్యాయని.. వచ్చే నెలాఖరుకు అన్నిపనులు పూర్తవుతాయన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లాలోని డేరా బాబానానక్ గురుద్వారా నుంచి పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను కలుపుతూ కర్తార్‌పుర్ నడవాను నిర్మించారు. ప్రతిరోజు 5వేల మంది సిక్కు భక్తులను వీసా లేకుండా అనుమతించేందుకు భారత్-పాకిస్థాన్‌లు ఓ అంగీకారానికి వచ్చాయి.
ఇదీ చూడండి:- మోదీ జన్మదినాన దేశ ప్రజలకు భాజపా కానుక