జపాన్ వాసులను చెర్రీ పూల సోయగాలు మైమరిపింపజేస్తున్నాయి. టోక్యోలోని మెగురో నది వెంబడి ఈ సుందర దృశ్యాలను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. గత వారమే టోక్యోలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేయగా అక్కడ సందడి నెలకొంది. అయితే.. ఈ చెర్రీ చెట్ల కింద పిక్నిక్ పార్టీలు జరుపుకోవడాన్ని జపాన్ ప్రభుత్వం నిషేధించింది.
జపాన్లో 'సకురా' అనే పూలు ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో వికసిస్తాయి. దాంతో జపాన్లో వసంతకాలం ప్రారంభమైందని భావిస్తారు. పాఠశాలలు, నూతన వాణిజ్య సంవత్సరం ఇదే నెలలో ప్రారంభమవుతాయి. అయితే.. 70 ఏళ్లలో తొలిసారిగా ఈ సారి ఏప్రిల్ కంటే ముందుగానే ఈ పూలు వికసించాయని అధికారులు చెబుతున్నారు. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని వివరిస్తున్నారు.