జపాన్ నౌకలో కొవిడ్-19 బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకంటించింది. తాజాగా మరో 57 మందికి వ్యాధి సోకినట్లు వైద్యుల నిర్ధరించారు.
నౌకలో కొత్త కేసులతో సహా ఇప్పటివరకు 691మంది కరోనా బారిన పడ్డారు. జపాన్‌లో మొత్తం 826 మంది కొవిడ్-19 బారిన పడగా.. నలుగురు మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది.
జపాన్ తీరంలోని నౌకలో కరోనా వైరస్‌తో ముగ్గురు మృతిచెందారు. వీరు 80ఏళ్లు పైబడిన వృద్ధులుగా ఆ దేశ మీడియా పేర్కొంది. వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరగడమే కాకుండా మృతుల సంఖ్య పెరుగుతుండటం వల్ల నౌకలో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:78 వేల మందికి కరోనా- ఏ దేశంలో ఎంత మంది?