హగీబిస్ తుపాను సృష్టించిన బీభత్సంతో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలు, తీవ్రమైన గాలులతో తూర్పు ప్రాంతమంతా అతలాకుతలం అయింది. ఈ విధ్వంసంలో 56 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వందల మంది గాయపడ్డారు.
తుపాను తీవ్రత తగ్గిన నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేసింది జపాన్ ప్రభుత్వం. సహాయక చర్యల కోసం సైన్యం, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపింది. వరదల్లో చిక్కుకున్నవారిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరికొన్ని చోట్ల పడవల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు.
గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వరదలు మిగిల్చిన బురదలో, ఉద్ధృతంగా ప్రవహించే నదుల్లో జల్లెడ పడుతున్నారు.
జపాన్లో విధ్వంసం