జపాన్ చక్రవర్తి అకిహిటో సింహాసనాన్ని వీడారు. చక్రవర్తి పీఠాన్ని తన పెద్ద కుమారుడు, 59ఏళ్ల యువరాజు నరుహిటోకు అప్పగిస్తున్నారు. బుధవారం నూతన చక్రవర్తి బాధ్యతలు చేపడతారు.
ప్రత్యేక పూజలు
సింహాసనం నుంచి వైదొలిగే ముందు అకిహిటో చక్రవర్తి టోక్యోలోని ప్రధాన దేవాలయం కషికొడొకొరోలో సంప్రదాయ వస్త్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ దేవాలయంలో కొలువై ఉండే దేవత అమాటెరసును రాజకుటుంబ పూర్వీకురాలుగా భావిస్తారు. పూజల్లో భాగంగా తన పూర్వీకులు, షింటో దేవతలను ఆరాధించారు అకిహిటో.
బుధవారం నూతన చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యే వరకు అకిహిటో నామమాత్రపు చక్రవర్తిగా వ్యవహరిస్తారు.
85 ఏళ్ల అకిహిటో 1989 నుంచి చక్రవర్తిగా కొనసాగుతున్నారు. తాను వైదొలుగుతున్నట్లు 2016లో ప్రకటించారు అకిహిటో. వయో భారం, అనారోగ్యమే ఇందుకు కారణాలని చెప్పారు.
రీవా... జపాన్ నూతన శకం