పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని గాజా ప్రాంతం (Gaza Strip) మరోసారి బాంబులతో మార్మోగింది. ఆదివారం ఇజ్రాయెల్ సేనలు గాజాలోని ఆయుధాల తయారీ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో 13 ఏళ్ల బాలిక సహా 24 మంది పాలస్తీనా పౌరులు గాయపడ్డారని గాజా అధికారులు తెలిపారు.
Gaza Strip: గాజాలో మరోసారి బాంబుల మోత - పాలస్తీనా
గాజా ప్రాంతంలో(Gaza Strip) మరోసారి బాంబుల మోత మోగింది. ఇజ్రాయెల్ సేనలు గాజాలోని ఆయుధాల తయారీ, నిల్వ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి.
గాజా
గాజాకు (Gaza Strip) చెందిన వారు పదుల సంఖ్యలో గుమికూడి సరిహద్దు వద్ద శనివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. గాజా దిగ్భందాన్ని నిరసిస్తూ వారు ఇజ్రాయెల్ దళాలపైకి రాళ్లు, పేలుడు పదార్థాలు విసిరారు. ఈ ఘటనలో ఇజ్రాయెల్ సరిహద్దు పోలీసు ఒకరు గాయపడ్డారు. దీంతో ఇజ్రాయెల్ దళాలు గాజాలోని నాలుగు ఆయుధ తయారీ కేంద్రాలపై బాంబు దాడులు చేశాయి. పాలస్తీనా పోలీసులు ఆదివారం 24 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ వైమానిక దాడులు
Last Updated : Aug 23, 2021, 6:23 AM IST