తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆ రెండు టీకాలు కలిపి ఇస్తే కరోనా నుంచి రక్ష!' - స్పుత్నిక్​-వీ టీకా

ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్​-వి టీకాల సమ్మేళనం ఎలాంటి దుష్ప్రభావాలు చూపలేదని రష్యా సంస్థ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్​డీఐఎఫ్​) ప్రకటించింది. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకకుండా అడ్డుకోవడంలో, అలాగే తీవ్రస్థాయి కొవిడ్‌ బాధితుల ప్రాణాలను నిలబెట్టడంలో ఈ మిశ్రమం మెరుగ్గా పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రాథమిక ఫలితాల్లో వెల్లడైనట్లు తెలిపింది.

AstraZeneca, Sputnik V mix
ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్​-వీ టీకాల సమ్మేళనం

By

Published : Jul 30, 2021, 5:12 PM IST

కరోనాను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు రెండు వేర్వేరు టీకాలను కలిపే ప్రయోగాలపై ప్రపంచ దేశాలు తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్​-వి టీకాల మిశ్రమం ఎలాంటి దుష్ప్రభావాలు చూపలేదని రష్యా సంస్థ రష్యన్​ డైరెక్ట్​ ఇన్​వెస్ట్​మెంట్​ ఫండ్​(ఆర్​డీఐఎఫ్​) ప్రకటించింది. ఈ మిశ్రమ టీకా తీసుకున్నవారిలో ఎటువంటి ప్రతికూలతలకు గురి కాలేదని.. అలాగే కరోనా బారిన పడకుండా సమర్థంగా పని చేస్తున్నట్లు తెలిపింది. ఆ రెండు టీకాల సమ్మేళనంపై నిర్వహించిన ట్రయల్స్​లో ఈమేరకు వెల్లడైందని ఆర్​డీఐఎఫ్​ పేర్కొంది.

ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం, ఆర్​డీఐఎఫ్​ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మిశ్రమంపై ట్రయల్స్​ నిర్వహించారు. కొవిడ్​ను సమర్థంగా ఎదుర్కొనే టీకా అభివృద్ధిలో సహకారం లక్ష్యంగా ఆర్‌డీఐఎఫ్, ద గమలేయ సెంటర్​, ఆస్ట్రాజెనెకా, ఆర్-ఫార్మ్​ ఒప్పంద పత్రంపై గతంలో సంతకాలు చేశాయి. అనంతరం ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్​-వి తొలి కాంపోనెంట్​ మిశ్రమ టీకాపై 2021 ఫిబ్రవరిలో పరిశోధన ప్రారంభించాయి. ఇందులో భాగంగా 50 మంది వలంటీర్లపై ట్రయల్స్​ నిర్వహించారు. ఈ డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. ఎలాంటి దుష్ప్రభావాలు చూపలేదని పేర్కొన్నారు.

"దీనిపై ప్రపంచ దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. యూఏఈలో వలంటీర్లకు టీకా అందిస్తున్నాం. రష్యా, బెలారస్​ దేశాల్లో ట్రయల్స్​కు అనుమతి పొందాం" అని పరిశోధకలు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డేటాను ఈ ఆగస్టులో ప్రచురించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:టీకా మిక్సింగ్‌తో లాభమా? నష్టమా?

ABOUT THE AUTHOR

...view details