కరోనా... యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న సరికొత్త మహమ్మారి. ఆ వైరస్ ఎలా ఉంటుంది? చికిత్స ఎలా? వ్యాక్సిన్ ఏది?... ఇలా ప్రతి అంశమూ వైద్యులకు కొత్తే. అందుకే ప్రపంచవ్యాప్తంగా కరోనాకు సంబంధించి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.
వైరస్‌తో బాధ పడుతున్న గర్భణీల ద్వారా పుట్టబోయే శిశివుకు కూడా వ్యాధి సంక్రమిస్తుందా అన్న దానిపై అధ్యయనం చేశారు చైనా పుడాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. మొత్తం 33 గర్భణిలపై పరిశోధనలు చేయగా వారిలో ముగ్గురికి పుట్టిన శిశువులు మాత్రమే మహమ్మారితో బాధపడుతున్నట్లు గ్రహించారు. వీరికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ముగ్గురు శిశివుల్లోనూ ఒకే రకమైన లక్షణాలు కనిపించినట్లు తెలిపారు.
మొదటి శిశువు...
గర్భం దాల్చిన 40 వారాల తర్వాత శిశువుకు జన్మనిచ్చించి తల్లి. పుట్టిన రెండో రోజున జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించిన అధికారులు.. శిశువును ఐసీయూకు తరలించారు. ఆ శిశువు నిమోనియాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వైరస్ పరీక్షలు నిర్వహించగా నాలుగు రోజుల పాటు వరుసగా కరోనా పాటిజివ్‌గా వచ్చింది. ఆరో రోజు మాత్రం వైరస్ నెగటివ్‌గా తేలింది.