షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) పీస్ మిషన్లో భాగంగా రష్యాలో జరగనున్న ఉగ్రవాద నిరోధక యుద్ధ విన్యాసాల్లో భారత్ పాల్గొననుంది. ఇదే కార్యక్రమంలో చైనా-పాకిస్థాన్ కూడా పాలుపంచుకోనున్నాయి(india china relations). ఆయా దేశాలతో భారత్కు గత కొంత కాలంగా విభేదాలు నెలకొన్న తరుణంలో రష్యాలో జరగనున్న కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది.
విన్యాసాలు ఈ వారంలో ప్రారంభమై.. ఈ నెల 26 వరకు కొనసాగుతాయి. దేశం తరఫున ఉన్నతస్థాయి సైనిక, వాయుసేన దళాలు రష్యాకు వెళ్లనున్నాయి. వాస్తవానికి ఈ విన్యాసాలు గతేడాది కూడా జరగ్గా.. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తప్పుకుంది భారత్(india china border news).