తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా సీనియర్​ అధికారితో భారత రాయబారి భేటీ

చైనాలోని భారత రాయబారి విక్రమ్​ మిస్రీ, సీపీసీ సెంట్రల్​ కమిటీ సీనియర్​ అధికారితో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు, లద్దాఖ్​లో పరిస్థితులపై భారత వైఖరిని వివరించారు మిస్రీ. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై భారత్​-చైనాల మధ్య చర్చలు జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Indian Ambassador
చైనా సీనియర్​ అధికారితో భారత రాయబారి భేటీ

By

Published : Aug 12, 2020, 10:59 PM IST

చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆ దేశ సీనియర్​ అధికారితో భేటీ అయ్యారు అక్కడి భారత రాయబారి విక్రమ్​ మిస్రీ. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలతో పాటు తూర్పు లద్దాఖ్​లోని సరిహద్దు పరిస్థితులపైనా చర్చించారు.

సీపీసీ సెంట్రల్​ కమిటీ విదేశీ వ్యవహారాల కమిషన్​ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్​ లియు జియాన్​చావోతో మిస్రీ సమావేశం అయ్యారు. తూర్పు లద్దాఖ్​లోని అన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవటంపై భారత్​, చైనా మధ్య దౌత్య, సైనిక స్థాయి చర్చలు జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురి మధ్య భేటీపై చైనాలోని దౌత్య కార్యాలయం ట్వీట్​ చేసింది.

" భారత రాయబారి విక్రమ్​ మిస్రీ ఈరోజు లియు జియాన్​ చావోతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి ధ్వైపాక్షిక సంబంధాలతో పాటు తూర్పు లద్దాఖ్​లో పరిస్థితులపై భారత వైఖని వివరించారు.

- భారత దౌత్య కార్యాలయం

తూర్పు లద్ధాఖ్​లోని నియంత్రణ రేఖ వెంబడి ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ ముందుకు వెళ్లటం లేదన్న వార్తల నేపథ్యంలో ఇరువురు భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సైనిక స్థాయి చర్చల్లో చైనా దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, మే 5 నాటికి ముందున్న యాథాతథ స్థితిని పునరుద్ధరించాలని భారత్​ పట్టుబట్టింది.

పలుమార్లు జరిగిన చర్చలతో గల్వాన్ లోయ, ఇతర ప్రాంతాల నుంచి బలగాలను చైనా ఉపసంహరించుకున్నప్పటికీ.. కీలక ఫింగర్​ ఏరియాలైన పాంగోంగ్​ త్సో, గోగ్రా, దేప్సాంగ్​ల నుంచి వెనక్కి తగ్గలేదు.

ABOUT THE AUTHOR

...view details