చైనా సైనిక విస్తరణవాదం పెరుగుతున్న వేళ అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని చతుర్ముఖ కూటమి (క్వాడ్) దేశాలు నిర్ణయించాయి. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించడం, స్వేచ్ఛా నౌకాయానం సహా వివాదాల శాంతియుత పరిష్కారానికి అంగీకరించాయి. ఈ మేరకు గురువారం వర్చువల్‌గా సభ్యదేశాలైన భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ల మధ్య 3వ క్వాడ్ దేశాల మంత్రుల స్థాయి సమావేశం జరిగింది.
ఈ భేటీలో భారత్ నుంచి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మారిసే పేన్, తోషిమిత్సు మోతెగి పాల్గొన్నారు. కొవిడ్ పోరుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి జై శంకర్ చెప్పారు. వ్యాక్సినేషన్‌తో పాటు వైద్యం, వైద్య పరికరాల్లో పరస్పర సహకారానికి అంగీకరించినట్లు తెలిపారు.