కర్తార్‌పుర్ సాహిబ్‌ను సందర్శించే భక్తులకు పాస్‌పోర్టు అవసరమా? లేదా? అనే విషయంపై పాకిస్థాన్ స్పష్టత ఇవ్వాలని కోరినట్లు భారత్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సదర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు అధికారులు. కార్తార్పుర్ను సందర్శించే భక్తులకు పాస్‌పోర్టు అవసరం లేదని ఇమ్రాన్ అన్నారు, కానీ ఒప్పందం ప్రకారం పాస్‌పోర్టు తప్పనిసరి అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఒకవేళ అవసరం లేదనుకుంటే ఒప్పందాన్ని సవరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
స్పందన కరవు
కర్తార్‌పుర్ నడవాకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రత్యేక అధికార బృందాలకు అనుమతివ్వాలని పాకిస్థాన్‌ను కోరింది భారత్ . అయితే దాయాది దేశం నుంచి ఇప్పటి వరకు ఆ విషయంపై ఎలాంటి స్పందన రాలేదని అధికారులు పేర్కొన్నారు.