తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​ ఆర్థిక సాయంతో నేపాల్​లో పాఠశాల - శ్రీ సప్తమై గురుకుల్ సంస్కృత విద్యాలయ

నేపాల్​లో భారత్ ఆర్థిక సాయంతో (రూ.1.94 కోట్లు) నిర్మించిన ఓ పాఠశాలను సోమవారం ప్రారంభించినట్లు ఇండియన్ ఎంబసీ తెలిపింది. ఈ పాఠశాలలో విద్యార్థులకు.. వేద, ఆధునిక విద్యలు నేర్పుతారని వెల్లడించింది.

India funded new school infrastructure inaugurated in Nepal
భారత్ ఆర్థిక సాయంలో నేపాల్ 'పాఠశాల' ప్రారంభం

By

Published : Jul 6, 2020, 8:16 PM IST

భారత్​ ఆర్థిక సాయంతో నేపాల్​లోని ఇలం జిల్లాలో నిర్మించిన ఓ పాఠశాల భవనాన్ని సోమవారం ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

వేద, ఆధునిక విద్యలు బోధించే ఈ పాఠశాల... భవన నిర్మాణం కోసం భారత్​ రూ.1.94 కోట్లు (నేపాలీ రూపాయల్లో 31.13 మిలియన్లు) ఆర్థిక సాయం అందించింది.

పాఠశాల ప్రారంభించిన భారత్, నేపాల్ అధికారులు

"'శ్రీ సప్తమై గురుకుల్ సంస్కృత విద్యాలయ' ఏర్పాటుకు 2009లోనే కృషి జరిగింది. వేద, ఆధునిక విద్యలు బోధించే ఈ పాఠశాల భవనం ఇప్పుడు పూర్తి అయ్యింది. ఈరోజు దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్, నేపాల్ అధికారులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు."

- నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం

నాలుగు అంతస్తుల ఈ పాఠశాల భవనంలో 10 తరగతి గదులు, విద్యార్థుల కోసం తొమ్మిది వసతి గృహాలతో హాస్టల్ బ్లాక్, నాలుగు స్టడీ రూం​లు, ఓ లివింగ్ రూం, వార్డెన్ కార్యాలయం, ఓ సమావేశ మందిరం ఉన్నాయి.

2015లో సంభవించిన భారీ భూకంపం ధాటికి నేపాల్​లోని అనేక భవనాలు కుప్పకూలాయి. అనేక పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయి. దీనితో నేపాల్ విద్యార్థుల భవిత కోసం భారత్​ అనేక పాఠశాలల నిర్మాణానికి ఆర్థిక చేయూతనందించింది.

ఇదీ చూడండి:జవాన్లు ఎంతటి చలినైనా తట్టుకునేలా ప్రత్యేక టెంట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details