తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్-చైనా సరిహద్దులో ఎందుకీ ఉద్రిక్త పరిస్థితులు? - reasons behind india china war 2020

భారత-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాణనష్టం సంభవించి.. భిన్నమైన ప్రతిష్టంభన నెలకొంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ పరిస్థితులు దేనికి దారి తీయనున్నాయి. ప్రాదేశిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇరుదేశాలు అనుసరిస్తోన్న వైఖరిపై సొసైటీ ఆఫ్ పాలిసీ స్టడీస్ డైరెక్టర్ సి.ఉదయభాస్కర్ విశ్లేషణ చూద్దాం.

india china standoff and the reason behind war situation in line of control
india china standoff

By

Published : Jun 16, 2020, 3:39 PM IST

భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధంపై ప్రాదేశికతకు సంబంధించిన సంక్లిష్టమైన వివాదాస్పద సమస్యలు ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. 4000 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి ఇటీవలి పరిణామాలే ఇందుకు నిదర్శనం. సాధారణం కంటే అధికంగా నియంత్రణ రేఖ వెంబడి మోహరింపులు జరిగాయి. తూర్పు లద్ధాక్​‌లోని పాంగోంగ్ సరస్సు ఒడ్డున, గాల్వాన్ నదీ లోయ వంటి అయిదు ప్రాంతాల్లో ఈ మోహరింపులతో పాటు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఘర్షణల కారణంగా ప్రాణ నష్టానికి దారితీశాయి.

ప్రాదేశిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇరుదేశాలు అనుసరిస్తోన్న వైఖరిపై సొసైటీ ఆఫ్ పాలిసీ స్టడీస్ డైరెక్టర్ సి ఉదయభాస్కర్ విశ్లేషణ ..

ఆరు దశాబ్దాల తర్వాత అశాంతి..

భారతదేశం, చైనా వరుసగా 1947, 1949లలో స్వాతంత్య్రం సాధించాయి. రెండూ పురాతన నాగరికతలున్న దేశాలే. వలసరాజ్యాల పాలన 19వ శతాబ్దంలో దేశ పటాలలో విభజనకు దారితీశాయి. తత్ఫలితంగా వలసరాజ్య ఆలోచనలకు అనుగుణంగా సరిహద్దులను ఏర్పరుచుకున్నా, ఏకాభిప్రాయంతో అంగీకరించిన సరిహద్దులు భారతదేశం, చైనా రెండింటికీ అస్పష్టంగా ఉన్నాయి. సంక్లిష్ట ప్రాదేశిక వివాదంపై ఇరుదేశాలు అక్టోబర్ 1962లో సంక్షిప్త యుద్ధానికి పాల్పడ్డాయి, అది ఎటువంటి తీర్మానం లేకుండా ముగిసింది, దాదాపు ఆరు దశాబ్దాల తరువాత, అశాంతితో కూడిన స్తబ్ధత కొనసాగుతోంది. గత దశాబ్దంలో వాస్తవాధీన రేఖ వెంట మూడు ప్రధాన సైనిక దాడులు జరిగాయి 2013లో డెప్సాంగ్, 2014లో చుమర్, 2017లో డోక్లాం ఇలా ప్రతి ఒక్కటి రాజకీయ-దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం అయ్యాయి.

ఈ ఏడాది ఏప్రిల్ మూడో వారంలో చైనా దళాలు లద్ధాక్​‌లోని వాస్తవాధీన రేఖ వెంట తమ స్థానాలను చడీ చప్పుడు లేకుండా బలంగా ఏర్పరుచుకున్నాయి. ఈ విషయం తర్వాత బయటపడింది. మే మొదటి వారంలో పీఎల్ఏ చొరబాటు/అతిక్రమణలు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. చైనా సైన్యం మోహరింపు సంఖ్య పరంగా చూస్తే 5000 దాటింది. తదనుగుణంగా భారత్ కూడా తన ఏర్పాట్లతో మోహరింపునకు దిగింది.

తూర్పు లద్ధాక్​‌లోని అతిక్రమణలు జరిగిన ప్రాంతాలు, వాటిలో చైనా సైనిక బలాలు గతంలో కన్నా ఎక్కువగా ఉన్నాయి. 489 కిలోమీటర్ల మేర ఉన్న లద్ధాక్​ వద్ద ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఈ చర్యలు కనిపిస్తాయి. ఉదాహరణకు తాజాగా ఘర్షణలు జరిగిన గాల్వన్ లోయ చరిత్ర చూస్తే దశాబ్దాలుగా ఎప్పుడూ అతిక్రమణలు జరిగిన దాఖలాలు లేవు, కానీ ఈ ఏప్రిల్ నుంచి కవ్వింపు చర్యలు పలు చోట్ల మొదలయ్యాయి. అందువల్ల ప్రస్తుత ప్రతిష్టంభన పరిణామాలు చాలా తీవ్రమైనవిగా ఉండేలా కనిపిస్తున్నాయి. వేగవంతమైన రాజకీయ తీర్మానాన్ని ఈ పరిణామాలు ఆశిస్తున్నాయి.

ఇదీ చదవండి:ఆ భారత అధికారులను తీవ్రంగా హింసించిన పాక్​!

ABOUT THE AUTHOR

...view details