పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) సమావేశం ముగిసింది. ఎస్సీఓ రక్షణ, భద్రత నిపుణుల 9వ సమావేశం ఈ నెల 19, 20 తేదీల్లో జరిగింది. భారత్ సహా ఇతర సభ్యదేశాలు పాల్గొన్నాయి.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన తర్వాత భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలహీనమయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్‌లో జరిగిన సమావేశానికి భారత్ హాజరవ్వడం ఇదే తొలిసారి.
చర్చలు..
ఈ సమావేశంలో సభ్య దేశాలన్నీ ప్రాంతీయ భద్రత సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు పాకిస్థాన్ సైనిక మీడియా విభాగం.. ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) తెలిపింది. సైనికులకు ఉమ్మడి శిక్షణ, కసరత్తుపై సభ్యదేశాలు కీలక సమాచారం, అభిప్రాయాలు పంచుకున్నట్లు పేర్కొంది.