అఫ్గానిస్థాన్‌ను తాలబన్లు(Afghan Taliban) తమ నియంత్రణలోకి తెచ్చుకున్న అనతరం ఆ దేశానికి చెందిన 9.5 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలపై అమెరికా ఆంక్షలు విధించింది. తాలిబన్ల ప్రభుత్వాన్ని(Taliban government) గుర్తించమని తెలిపింది. ఈ బాటలోనే దాని మిత్ర దేశాలు, ప్రపంచంలోని ఇతర దేశాలు నడుస్తున్నాయి. ఈ ఆంక్షలతో తలెత్తే ఆర్థిక సంక్షోభం తాలిబన్లకు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
అయితే ప్రపంచదేశాలన్నీ అంక్షలు విధించినా అఫ్గాన్‌కు ఓ మార్కెట్ అండగా నిలవనుంది. కాబుల్‌లో(sarai shahzada kabul afghanistan) ఉండే ఈ ప్రాంతంలో రోజుకు రూ.వందల కోట్ల నగదు మార్పిడి జరుగుతుంటుంది. ఎవరి చేతిలో చూసినా నోట్ల కట్టలే దర్శనిస్తుమింటాయి. సరాయ్ షహ్జాదాగా(sarai shahzada money exchange) పిలిచే ఈ మార్కెటే అఫ్గాన్‌లో నగదు మార్పిడికి కేంద్రం. ఇక్కడి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే న్యూయార్క్ వాల్‌స్ట్రీట్‌లో వ్యాపారా లావాదేవీల్లా ఉంటుంది.
అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లకు ఇప్పుడు ఆర్థిక మద్దతు అత్యవసరం. సంక్షోభం రాకుండా ముందుగానే ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆగస్టు 15న కాబుల్‌లోకి మధ్యాహ్నం 3:00గం.లకు ప్రవేశించిన వారు.. 5:30గం.లకే సరాయ్ షహ్జాదా మార్కెట్‌పై పూర్తిగా పట్టు సాధించారంటే ఇది వారికి ఎంత కీలకమో ఆర్థమవుతుంది.
అఫ్గాన్ ప్రభుత్వం ఖర్చు చేసే నిధుల్లో దాదాపు 75 శాతం విదేశాల నుంచి ఆర్థిక సాయంగా అందేవే. అయితే అఫ్గాన్ జాతీయ బ్యాంకు 'ద అఫ్గానిస్థాన్ బ్యాంకు' విదేశీ నిల్వలపై అమెరికా ఆంక్షలు విధించడం ఇబ్బందిగా మారింది. దీంతో రెండు శతాబ్దాలుగా అఫ్గాన్ ఆర్థిక(Afghanistan economy) వ్యవస్థకు మూల స్తంభాలుగా ఉన్న నగదు మార్పిడి సంస్థలే ఇప్పుడు.. మరోసారి ఆ దేశాన్ని కాపాడనున్నాయి.
ఇక్కడ నగదు మార్పిడి జరపడాన్ని సరాఫ్, శితోస్ అని పిలుస్తుంటారు. కస్టమర్ల నగదును భద్రపరచడమే గాక వారికి ఇతర సేవలను కూడా అందిస్తుంటారు. విదేశీ కరెన్సీ మార్పిడి, పొరుగు దేశాల నుంచి వస్తువుల సరఫరా వంటివి ఎంతో నమ్మకంగా జరుపుతుంటారు.
వీరు అందించే సేవలు..
- రిటైల్ సేవింగ్ అకౌంట్లో కస్టమర్ల డబ్బు భద్రపరచడం
- ఇతర దేశాలతో సరకుల వ్యాపారం జరపడానికి రుణాలు(క్రెడిట్ కార్డులు) ఇవ్వడం
- హవాలా రూపంలో లావాదేవీలు జరపడం