మూడేళ్లకాలంలో ఇమ్రాన్ ఆదాయం మూడుకోట్ల మేర పడిపోయిందని ఓ మీడియా సంస్థ స్పష్టం చేసింది.
రాజకీయ నాయకుడిగా అవతారమెత్తిన ఈ మాజీ క్రికెటర్ 2015లో రూ. 3.56 కోట్లు(పాకిస్థాన్ రూపాయల్లో) ఆర్జించారు. ఈ గణాంకాల్ని తర్వాతి సంవత్సరాల్లో ఇమ్రాన్ నిలబెట్టుకోలేకపోయారు. 2016లో రూ. 1.29 కోట్లు సంపాదించిన ఆయన 2017లో రూ. 0.47 కోట్లు మాత్రమే ఆర్జించారు.
2015లో రూ. 0.76 కోట్లుగా ఉన్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ ఆదాయం 2017 నాటికి రూ. 1 కోటికి ఎగబాకింది.
అదే సమయంలో మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ 2015లో 10.5 కోట్లు ఆర్జించారని నివేదిక స్పష్టం చేసింది. జర్దారీ వరుసగా 2016లో రూ. 11.4 కోట్లు, 2017లో రూ. 13.4 కోట్లు సంపాదించారు. జర్దారీకి 7748 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ప్రకటించింది. జర్దారీ కంటే ఆయన కుమారుడి పేరున ఎక్కువ ఆస్తులున్నట్లు పేర్కొందీ నివేదిక.