తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాసలో కశ్మీర్​ అంశం ప్రస్తావనకు పాక్​ నిర్ణయం - ఐక్యరాజ్య సమితి

కశ్మీర్​ అంశంపై అంతర్జాతీయంగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఇంకా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది పాకిస్థాన్​. వచ్చే నెలలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్​ సమస్యను లేవనెత్తాలని నిర్ణయించింది. కశ్మీర్​లోని పరిస్థితులపై ఐరాస మానవహక్కుల హైకమిషనర్​కు మరోమారు లేఖ రాసింది దాయాది.

'ఐరాసలో కశ్మీర్​ సమస్య లేవనెత్తాలని పాక్​ నిర్ణయం'

By

Published : Aug 23, 2019, 6:12 PM IST

Updated : Sep 28, 2019, 12:33 AM IST

ఐరాసలో కశ్మీర్​ అంశం ప్రస్తావనకు పాక్​ నిర్ణయం

కశ్మీర్​ అంశంలో పాకిస్థాన్​ తన వక్రబుద్ధిని కొనసాగిస్తోంది. వచ్చే నెలలో జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ కశ్మీర్​ వ్యవహారాన్ని లేవనెత్తనున్నారని ఆ దేశ మీడియా వర్గాలు వెల్లడించాయి.

సెప్టెంబర్‌ 27న ఐరాస సాధారణ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగించనున్నారు. న్యూయార్క్‌లో ఈ సమావేశం జరిగే సమయంలో.. భారత్​కు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరపడానికి మద్దతు కూడగట్టాలని పార్టీ వర్గాలను ఇమ్రాన్‌ ఆదేశించినట్లు సమాచారం.

సెప్టెంబర్‌ 23 నుంచి ఇమ్రాన్‌ నాలుగు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలువురు దేశాధినేతలతో సమావేశం అవుతారని ఆ దేశ మీడియా వెల్లడించింది. దీంతో పాటు అమెరికాలోని పాక్‌ సంతతి ప్రజలు, వ్యాపార వర్గాలతో ఇమ్రాన్‌ సమావేశం నిర్వహించనున్నారని తెలిపింది.

మానవహక్కుల హైకమిషనర్​కు లేఖ

కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హైకమిషనర్​ మిచెల్​ బాచిలెట్​కు మరోమారు లేఖ రాసింది పాకిస్థాన్​. జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు తర్వాతి పరిణామాలను లేఖలో పేర్కొన్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ఐరాస భద్రత మండలి, యూఎన్​ సభ్య దేశాలకు ఈ లేఖను పంపనున్నట్లు పేర్కొంది.

కశ్మీర్​ అంశంపై గతంలో ఆగస్టు 4న మహమ్మూద్​ ఖురేషీ ఐరాస మానవహక్కుల కమిషనర్​కు లేఖ రాశారు. ఆగస్టు 8న ఫోన్​లో మాట్లాడారు.

ఇదీ చూడండి: మైనార్టీల భద్రతపై ఐరాసలో పాక్, చైనాకు అక్షింతలు

Last Updated : Sep 28, 2019, 12:33 AM IST

ABOUT THE AUTHOR

...view details