ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు కాస్త ఊరట లభించింది. ఆ దేశానికి మూడో విడతగా చెల్లించాల్సిన 50కోట్ల డాలర్ల రుణానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆమోదం తెలిపింది.
పాక్‌కు ఐఎంఎఫ్ 50 కోట్ల డాలర్ల రుణం - ఐఎంఎఫ్
కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు ఊరట కల్పించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్). ఆ దేశానికి మూడో విడతగా చెల్లించాల్సిన రుణానికి ఆమోదం తెలిపింది. ఫలితంగా పాక్‌కు 50 కోట్ల డాలర్ల సాయం అందనుంది.
పాకిస్థాన్‌కు 50 కోట్ల డాలర్ల రుణం
39 నెలల ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(ఈఎఫ్ఎఫ్) కింద.. 2019లోనే పాకిస్థాన్‌కు 600 కోట్ల డాలర్ల రుణాన్ని విడతల వారీగా ఇచ్చేందుకు ఐఎంఎఫ్ అంగీకరించింది. ఈ మేరకు తొలి రెండు విడతల్లో 145 కోట్ల డాలర్ల రుణాన్ని అందించింది. అయితే.. కరోనా వ్యాప్తి కారణంగా మూడో విడతలో జాప్యం జరిగింది.