తెలంగాణ

telangana

ETV Bharat / international

మహిళలను వేధిస్తే ఇక బహిరంగ ఉరే!

మహిళలపై లైంగిక వేధింపులతో పాటు, చిన్నారుల హత్యలకు పాల్పడేవారిని బహిరంగంగా ఉరి తీయాలని పాక్​ పార్లమెంట్​ తీర్మానం చేసింది. 2018లో ఎనిమిదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, చంపినందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఇమ్రాన్​ సర్కార్​.

If harassing women No more hanging out!
మహిళలను వేధిస్తే ఇక బహిరంగ ఉరే!

By

Published : Feb 7, 2020, 8:04 PM IST

Updated : Feb 29, 2020, 1:36 PM IST

మహిళలపై లైంగిక వేధింపులు, చిన్నారుల హత్యలకు పాల్పడేవారిని బహిరంగంగా ఉరితీయాలన్న తీర్మానాన్ని పాకిస్థాన్ పార్లమెంటు ఆమోదించింది. 2018లో నౌషేరా ప్రాంతంలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, అతి దారుణంగా చంపేసిన ఘటన తర్వాత.. ఈ తీర్మానం తెరపైకి వచ్చింది.

బాలల హక్కుల సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం... గతేడాది జనవరి నుంచి జూన్‌ వరకు పాకిస్థాన్‌లో 1,304 మంది చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ కనీసం ఏడుగురు చిన్నారులు వేధింపులకు గురవుతున్నారు.

ఇదీ చూడండి: అమెరికా హిట్​లిస్ట్​: నాడు సులేమానీ​.. నేడు రైమి!

Last Updated : Feb 29, 2020, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details