తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా చికిత్సకు ఆ మందు వాడితే ప్రాణాలు హరీ! - హైడ్రాక్సీ క్లోరోక్విన్

కరోనా వైరస్​పై 'హైడ్రాక్సీ క్లోరోక్విన్​' అంతగా ప్రభావం చూపదని ఓ అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా దీన్ని అధికంగా వాడటం వల్ల ప్రాణం పోవచ్చని హెచ్చరించింది.

Hydroxychloroquine not effective against COVID-19: Study
కరోనా చికిత్సకు ఆ మందు వాడితే ప్రాణాలు హరి!

By

Published : Apr 23, 2020, 10:17 AM IST

మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్​ను కరోనా నియంత్రణకు వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఓ అధ్యయనం తేల్చింది. అమెరికాలోని ప్రముఖ ఆసుపత్రుల్లో వైరస్ బాధితులపై చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడినట్లు తెలిపింది.

ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి నివేదికను ప్రీప్రింట్ సర్వర్ మెడిరాక్సివ్‌ జర్నల్​లో ప్రచురించారు.

ఏప్రిల్​ 11 వరకు కరోనా బారిన పడిన 368 మంది చికిత్స విధానంపై అధ్యయనం చేశారు పరిశోధకులు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను యాంటీబయాటిక్‌ అజిత్రోమైసిన్‌తో కలిపి ఈ మందును తీసుకున్న వారిపై ఎలాంటి ప్రభావం కనిపించలేదని పేర్కొన్నారు. అయితే వీరిలో మరణాలు రేటు అధికంగా ఉందని వెల్లడించారు.

రాబోయే నెలల్లో ఈ మందుపై జరిగే అధ్యయనాలు మరింత సమాచారాన్ని అందిస్తాయని స్పష్టం చేశారు పరిశోధకులు. ఈ పరిశోధనలో 65 ఏళ్లు దాటిన పురుషులనే పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఫలితాలు మహిళలు, యువకులపై ఒకే విధంగా ఉంటాయని చెప్పలేమని స్పష్టం చేశారు.

అందువల్ల కరోనా బాధితులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్​ను ఉపయోగించటంలో, ముఖ్యంగా అజిత్రోమైసిన్‌ను కలిపినప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details