హాంగ్‌కాంగ్‌లో రాజకీయ వ్యవస్థ మారాలని ప్రజలు చేస్తోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. గత వారం జరిగిన హింసాత్మక ఘటనలపై యూన్లాంగ్లో వేల మంది నిరసన వ్యక్తం చేయగా మరోసారి పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయు ప్రయోగం చేశారు.
గత వారం హాంగ్‌కాంగ్ నిరసనకారులపై చైనా సానుభూతిపరులు విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు కూడా ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు. వీరి తీరుపై గర్హిస్తూ నేడు నిరసన బాట పట్టారు నిరసనకారులు.
తోపులాట
చైనా సానుభూతిపరులు యూన్‌లాంగ్ సమీపంలోని 2 గ్రామాల్లోకి పారిపోగా.. ఆ గ్రామాల్లోకి వెళ్లి నిరసన తెలిపేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ చర్యను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బాష్పవాయువు, రబ్బరు తూటాలు ప్రయోగించారు.