తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంకాంగ్​: విద్యార్థుల నిరసనలతో నేతలపై ఒత్తిడి

నేరస్థుల అప్పగింత సహా చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా హాంకాంగ్​​లో కొనసాగుతున్న నిరసనలు తీవ్ర స్థాయికి చేరాయి. వేసవి సెలవుల తర్వాత ఇటీవలే విద్యాసంస్థలు తెరుచుకున్నా.. విద్యార్థులు మాత్రం తరగతులు బహిష్కరించి నిరసనల్లో పాల్గొంటున్నారు. వీరి చర్యలతో రాజకీయ నేతలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

హాంకాంగ్​: విద్యార్థుల నిరసనలతో నేతలపై ఒత్తిడి

By

Published : Sep 3, 2019, 7:04 AM IST

Updated : Sep 29, 2019, 6:13 AM IST

విద్యార్థుల నిరసనలతో నేతలపై ఒత్తిడి

హాంకాంగ్​లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తార స్థాయికి చేరాయి. నిరసనకారులకు మద్దతుగా రెండు వారాల పాటు యూనివర్సిటీ బంద్​కు పిలుపునిచ్చారు విద్యార్థులు. సెంట్రల్​ హాంకాంగ్​లో వేలాది మంది ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలిపారు. ఫలితంగా గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలకాలని రాజకీయ నేతలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

నేరస్థులను చైనాకు అప్పగించే ఒప్పందం సహా హాంకాంగ్​పై చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు విద్యార్థులు వెన్నెముకగా ఉన్నారు.
ఆందోళనల్లో పాల్గొంటున్న వందలాది నిరసనకారులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నిరసనకారులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ చైనా అధికార పత్రికల్లో పలు సంపాదకీయాలు ప్రచురించాయి. హాంకాంగ్​ అనిశ్చితులకు ముగింపు వస్తుందంటూ హెచ్చరికలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులు ఆందోళనలు మరింత తీవ్రం చేశారు.

ఇదీ చూడండి: పడవలో చెలరేగిన మంటలు... 33 మంది గల్లంతు!

Last Updated : Sep 29, 2019, 6:13 AM IST

ABOUT THE AUTHOR

...view details