తెలంగాణ

telangana

వార్తా పత్రికలు కొని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం

హాంకాంగ్​ మీడియా దిగ్గజం జిమ్మీ లై అరెస్ట్​కు నిరసనగా.. ఆయనకు చెందిన యాపిల్​ డైలీ వార్తాపత్రికను పెద్దఎత్తున కొనుగోలుచేసి మద్దతు ప్రకటించారు అక్కడి ప్రజలు. ఇందుకోసం ఉదయాన్నే వార్తాపత్రికల దుకాణాల వద్ద బారులు తీరారు.

By

Published : Aug 11, 2020, 3:48 PM IST

Published : Aug 11, 2020, 3:48 PM IST

Hong Kong residents buy newspaper to support free press
హాంకాంగ్​లో వార్త పత్రికలు కొనడానికి బారులు తీరిన జనం

జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన హాంకాంగ్​ మీడియా దిగ్గజం జిమ్మీ లైకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఆయన అరెస్ట్​ను నిరసిస్తూ.. జిమ్మీకి చెందిన యాపిల్ డైలీ సహా ప్రజాస్వామ్య అనుకూల వార్తాపత్రికలను భారీఎత్తున కొనుగోలు చేస్తున్నారు. చైనా.. కొత్త జాతీయ భద్రతా చట్టం పేరుతో మీడియా గళాన్ని అణిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు హాంకాంగ్ వాసులు.

వార్తాపత్రికలు కొనేందుకు బారులు తీరిన జనం

ఓ వార్తాపత్రికల వ్యాపారి వద్ద ఉదయాన్నే సుమారు 200 దినపత్రికలు అమ్ముడయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో అతడి వద్ద 100 దినపత్రికలు అమ్ముడుపోవడమే గగనంగా ఉంటుంది.

వార్తా పత్రికలు అమ్ముతున్న ఓ వ్యాపారి

ఇదీ చూడండి:చైనా కక్షసాధింపు- హాంకాంగ్​ మీడియా దిగ్గజం అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details