తెలంగాణ

telangana

ETV Bharat / international

పిల్లల్లో లాక్​డౌన్ ఎఫెక్ట్- రెండున్నర రెట్లు పెరిగిన ఆ లోపం! - లాక్​డౌన్ చిన్నారులు

అనేక రంగాలను కుదిపేసి, ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన కరోనా.. చిన్నారులపైనా తీవ్రంగానే ప్రభావం(covid effect on children) చూపింది. ఎప్పుడూ బయట ఆడిపాడుతూ గడిపే వారిని.. ఇంటికే పరిమితం చేసింది. ఇదే పిల్లలకు శాపంగా మారింది. బయటకు ఎక్కువగా వెళ్లకపోవడం, ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల హ్రస్వదృష్టి(myopia in children) సమస్య రెండున్నర రెట్లు పెరిగింది.

myopia
పిల్లల్లో లాక్​డౌన్ ఎఫెక్ట్.. రెండున్నర రెట్లు పెరిగిన ఆ లోపం!

By

Published : Sep 5, 2021, 6:05 PM IST

లాక్​డౌన్ ఎఫెక్ట్​తో పిల్లలో రెండున్నర రెట్లు పెరిగిన హ్రస్వదృష్టి లోపం

నికోల్ లియూంగ్.. ఎనిమిదేళ్ల చిన్నారి. హాంకాంగ్​లోని అందరు పిల్లల్లాగే కరోనా లాక్​డౌన్(covid lockdown) సమయంలో ఇంటికే పరిమితమైంది. ఉపాధ్యాయులు ఆన్​లైన్​లో క్లాసులు(online classes) చెప్తే ఫోన్​లో చూస్తూ వినేది. ఇదంతా సాధారణంగానే కనిపిస్తున్నా.. చిన్నారుల జీవనశైలిలో వచ్చిన ఈ మార్పులు సమస్యలకు దారితీస్తున్నాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి చిన్నారుల్లో హ్రస్వదృష్టి(myopia in children) పెరిగిపోయింది.

హాంకాంగ్​లోని చైనీస్ యూనివర్సిటీ(Chinese University of Hong Kong) పరిశోధకులు 709 మంది పిల్లలపై అధ్యయనం చేసి ఈ నిర్ధరణకు వచ్చారు. 2015లో వెయ్యి మంది పిల్లలపై చేసిన ఇదే తరహా అధ్యయనంతో తాజా ఫలితాలను పోల్చి చూశారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. కొవిడ్ ఆంక్షలు(covid restrictions) అమలులోకి వచ్చిన తర్వాత చిన్నారుల్లో హ్రస్వదృష్టి సమస్య(myopia problem) రెండున్నర రెట్లు పెరిగింది.

లాక్​డౌన్(covid lockcown) సమయంలో నికోల్​కు.. వాళ్ల అమ్మ టీవీ చూసే అవకాశం ఇవ్వలేదు. ఫోన్లనూ పెద్దగా అప్పగించలేదు. కానీ.. ఆన్​లైన్ క్లాసులు(online classes) ప్రారంభమైన నేపథ్యంలో.. ఫోన్లు ఇవ్వక తప్పలేదు.

"కరోనా సమయంలో హాంకాంగ్​లో పిల్లలంతా ఆన్​లైన్ క్లాసులకు మారారు. తొలిసారి నికోల్​ను చెకప్​కు తీసుకెళ్లినప్పుడు ఆమె డయోప్టర్స్ 4.0గా నమోదైంది. కళ్లద్దాలు తీసుకున్నాం. ఇంకా ఎలాంటి చికిత్స తీసుకోలేదు. ఏడాదిన్నర తర్వాత చెకప్​కు వెళ్తే.. చిన్నారి హ్రస్వదృష్టి 1.5 డయోప్టర్స్​ మేర పెరిగింది. మాకు చాలా భయమేసింది."

-జెస్సికా చు, నికోల్ అమ్మ

ఇతర దేశాల్లోని పిల్లల సంగతి...?

కొవిడ్ సమయంలో హ్రస్వదృష్టి కేసుల(myopia in childhood) సంఖ్య గణనీయంగా పెరిగిందని పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జేసన్ యామ్ పేర్కొన్నారు. జీవనశైలిలోనూ అనేక మార్పులు గమనించినట్లు చెప్పారు. బయటకు వెళ్లడం బాగా తగ్గిందని, ఎలక్ట్రానిక్ పరికరాల స్క్రీన్​ను చూడటం పెరిగిందని వివరించారు. ఇవన్నీ హ్రస్వదృష్టి పెరిగేందుకు కారణమయ్యాయని చెప్పారు. అయితే, ఇతర దేశాల్లోని చిన్నారులకూ ఇదే అధ్యయనం వర్తిస్తుందని చెప్పలేమని అన్నారు.

"ఈ ఫలితాలను అందరికీ అన్వయించలేం. అయితే, ఏ నగరాల్లోని చిన్నారుల్లో అయితే ఇలాంటి జీవనశైలి మార్పులు కనిపించాయో.. వారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. బయటకు వెళ్లడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ వెలుతురు హ్రస్వదృష్టిని నియంత్రించి కంటిని కాపాడుతుంది. అందుకే పిల్లలను చీకటిగా ఉన్నప్పుడు కానీ, తక్కువ లైటింగ్​లో కానీ చదువుకోవద్దని చెప్తాం."

-డాక్టర్. జేసన్ యామ్, పరిశోధకుడు

ఏం చేయాలంటే?

ఈ అధ్యయనం ప్రకారం కరోనాకు ముందు సగటు స్క్రీన్ టైమ్ మూడున్నర గంటలు ఉంటే.. లాక్​డౌన్​ సమయంలో 8 గంటలకు పెరిగింది. ఫలితంగా హాంకాంగ్​లోని 40 శాతం మంది పిల్లలకు దృష్టి సమస్య తలెత్తిందని ప్రొఫెసర్ జేసన్ తెలిపారు. ఈ నేపథ్యంలో పిల్లలను బయటి వాతావరణంలో గడిపేలా చేయాలని(myopia in child treatment) తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. చిన్నారులు సగటున వారానికి 14 గంటలు బయటి వాతావరణంలో సమయం వెచ్చించాలని చెబుతున్నారు. చదువుకుంటున్నప్పుడు ప్రతి 30 నిమిషాలకొకసారి దూరంగా ఉన్న వస్తువులను చూడాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:మనసున్న మహారాజు.. చిన్నారుల కోసం వినూత్న గెటప్​లు

ABOUT THE AUTHOR

...view details