తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంకాంగ్​ నిరసనలు: జలఫిరంగులతో పోలీసుల దాడి

హాంకాంగ్​లో నిరసనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. ఆదివారం ఆందోళనకారులు రోడ్లమీదకు వచ్చి ప్రదర్శనలు చేశారు. వారిని చెదరకొట్టేందుకు పోలీసులు తొలిసారి జలఫిరంగులను ఉపయోగించారు.

హాంకాంగ్​ నిరసనలు: జలఫిరంగులతో పోలీసుల దాడి

By

Published : Aug 25, 2019, 11:30 PM IST

Updated : Sep 28, 2019, 6:48 AM IST

హాంకాంగ్​ నిరసనలు: జలఫిరంగులతో పోలీసుల దాడి

హాంకాంగ్​లో నేరస్థుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. గత మూడు నెలలుగా నగరం అంతా హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతోంది.

తాజాగా ఆదివారం నిరసనకారులు భారీ వర్షాలను సైతం లెక్క చెయ్యకుండా క్వాయ్​చుంగ్​ మైదానం నుంచి సుయెన్​ వాన్​ పార్కు వరకు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. చైనాకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ట్రాఫిక్​ అడ్డంకులు, చెల్లా చెదురుగా పడి ఉన్న వెదురు స్తంభాలతో నిరసకారులు బారికోడ్లను నిర్మించారు.

ఆందోళనకారులు నిరసనలు విరమించుకోవాలని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ వారు వినలేదు. పరిస్థితిని అదుపు చేసేందుకు తొలిసారిగా జల ఫిరంగులను ప్రయోగించారు పోలీసులు. రక్షక భటుల చర్యతో ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఫలితంగా ఆ ప్రాంతమంతా ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఇదీ చూడండి:హాంకాంగ్​: చల్లారని సెగ- ఆందోళనలు హింసాత్మకం

Last Updated : Sep 28, 2019, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details