తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంగ్​కాంగ్​ ఉద్రిక్తం- నిరసనకారులపై బాష్పవాయువు

నేరస్థులను విచారణ కోసం చైనాకు అప్పగించే వివాదాస్పద బిల్లుపై హాంగ్​కాంగ్​ ప్రజల నుంచి ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. వీధులన్నీ ఆందోళనకారులతో నిండిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తుతున్నాయి. పార్లమెంటు ముట్టడికి యత్నించిన నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

హాంగ్​కాంగ్​ ఉద్రిక్తం- నిరసనకారులపై బాష్పవాయువు

By

Published : Jun 12, 2019, 4:06 PM IST

నిరసనకారులపై బాష్పవాయువు

హాంగ్​కాంగ్​... రణరంగాన్ని తలపిస్తోంది. వివాదాస్పద ఎక్స్​ట్రాడిషన్​ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటు ముట్టడికి యత్నించారు ఆందోళనకారులు. చట్టసభకు నేతలు చేరుకోకుండా నగర వీధులన్నింటినీ దిగ్బంధించారు.

బిల్లుపై చర్చ జరగాల్సిన సమయంలో నిరసనలు ఉద్ధృతమవడంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఆందోళనకారులపై బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు.

ఘర్షణల దృష్ట్యా ఎక్స్​ట్రాడిషన్​ బిల్లుపై చర్చను వాయిదా వేశారు.

ఇదీ వివాదం....

నేరపూరిత చర్యలకు పాల్పడ్డ తమ దేశస్తులను విచారణ నిమిత్తం అవసరమైతే చైనాకు అప్పగించేందుకు వీలుగా హాంగ్​కాంగ్​ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుపై నేడు చర్చ జరగాల్సి ఉంది.

ప్రభుత్వం రూపొందించిన బిల్లు... హాంగ్‌కాంగ్‌ స్వతంత్ర న్యాయవ్యవస్థను దెబ్బతీసేలా ఉందన్నది నిరసనకారుల వాదన.

ఇదీ చూడండి:- నీరవ్​ మోదీకి నాల్గో సారి బెయిల్​ నిరాకరణ

ABOUT THE AUTHOR

...view details