తెలంగాణ

telangana

ETV Bharat / international

హాంగ్​కాంగ్​లో ప్రజావిజయం- 'చైనా బిల్లు'కు బ్రేక్​

ప్రజలు నుంచి వెల్లువెత్తిన నిరసనలకు హాంగ్​కాంగ్​ ప్రభుత్వం దిగొచ్చింది. నేరారోపణలపై విచారణ కోసం దేశ పౌరులను చైనాకు అప్పగించే బిల్లును ప్రస్తుతానికి పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది.

Hong Kong

By

Published : Jun 15, 2019, 3:29 PM IST

వారం రోజుల పాటు హాంగ్​కాంగ్​లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఆ దేశ ప్రభుత్వం తెరదించింది. నేరపూరిత కేసుల విచారణ కోసం దేశ పౌరులను చైనాకు అప్పగించే బిల్లును పక్కనబెడుతున్నట్లు తెలిపింది.

ప్రభుత్వ ముఖ్య కార్యనిర్వాహక అధికారి క్యారీ లామ్​ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

గతవారం నుంచి ఈ బిల్లును వ్యతిరేకించిన వేలాది మంది నిరసనకారులతో హాంగ్​కాంగ్​ వీధులు దద్దరిల్లాయి. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు ప్రజల నిరసనలకు తలొగ్గింది ప్రభుత్వం.

ఇదీ చూడండి: నిరసనలతో హోరెత్తిన హాంగ్​కాంగ్​ వీధులు

ABOUT THE AUTHOR

...view details