చైనాకు నేరస్థుల అప్పగింత బిల్లుపై ప్రజల నిరసనలకు తలొగ్గింది హాంగ్‌కాంగ్ ప్రభుత్వం. ఎట్టకేలకు చైనా బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆందోళనకారుల 5 ప్రధాన డిమాండ్లలో ఒకటైనా బిల్లు రద్దుపై వీడియో సందేశం ద్వారా నిర్ణయం వెలువరించారు హాంగ్‌కాంగ్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కారీ లామ్.
" ప్రజల నిరసనలకు తెరదించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బిల్లును ఉపసహరించుకుంటోంది."
-కారీ లామ్.
భారీ స్థాయిలో నిరసనలు
హాంగ్‌కాంగ్‌పై చైనా పెత్తనాన్ని నిరసిస్తూ గత జూన్ నెల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు ప్రజలు. వేల మంది వీధుల్లోకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న క్రమంలో వందల మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో అరెస్టయ్యారు.