తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆ పరిస్థితే వస్తే.. నా తలలో రెండుసార్లు కాల్చండి' - అమ్రుల్లా సలేహ్​ న్యూస్​

తాలిబన్లకు(Afghanistan Taliban) లొంగిపోయే ప్రసక్తే లేదని లండన్​ పత్రిక 'డైలీ మెయిల్​'కు రాసిన కాలమ్​లో పేర్కొన్నారు పంజ్​షేర్​లో(Panjshir valley) తిరుగుబాటు దళాలకు సారథ్యం వహిస్తున్న అమ్రుల్లా సలేహ్(amrullah saleh news)​. తాలిబన్లతో పోరాటంలో గాయపడితే తన తలలో రెండుసార్లు కాల్చాలని సైనికాధికారికి సూచించినట్లు చెప్పారు.

amrullah-saleh
అమ్రుల్లా సలేహ్‌

By

Published : Sep 5, 2021, 4:52 PM IST

తాలిబన్లతో(Afghanistan Taliban) జరుగుతున్న పోరాటంలో గాయపడితే తన తలలో రెండుసార్లు కాల్చాలని సైనికాధికారికి సూచించినట్లు అఫ్గానిస్థాన్‌ తాత్కాలిక అధ్యక్షుడు, పంజ్‌షేర్‌లో(Panjshir valley) తిరుగుబాటు దళాలకు సారథ్యం వహిస్తున్న అమ్రుల్లా సలేహ్‌(amrullah saleh news) తెలిపారు. అంతేకానీ తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని లండన్‌ పత్రిక 'డైలీ మెయిల్‌'కు రాసిన కాల‌మ్‌లో పేర్కొన్నారు. కాబుల్‌ తాలిబన్ల వశం ఎలా అయిందో వెల్లడించారు.

కాబుల్‌లో(Kabul news) ప్రభుత్వ పతనానికి ముందు జైల్లో తాలిబ‌న్ ఖైదీలు తిరుగుబాటుకు ప్రయ‌త్నిస్తున్నట్లు పోలీస్ చీఫ్ తనకు ఫోన్ చేసినట్లు తెలిపారు అమ్రుల్లా. తాలిబ‌న్ వ్యతిరేక ఖైదీల‌తో ఓ నెట్‌వ‌ర్క్ ఏర్పాటుచేసి తిరుగుబాటు అణిచేయాల‌ని ఆదేశించినట్లు చెప్పారు. ఆగస్టు 15న ఉదయం ర‌క్షణమంత్రి, హోంమంత్రికి ఫోన్ చేసినా స్పందన లేదన్నారు. చివ‌రికి రాష్ట్రప‌తి భ‌వ‌న్‌ను సంప్రదించినా కూడా ఫలితం లేకపోయిందన్నారు. ఆ త‌ర్వాతే ఇంటికి వెళ్లి త‌న భార్యాపిల్లల ఫొటోలు క‌నిపించ‌కుండా చేసి సైనికాధికారితో కలిసి పంజ్‌షేర్‌కు పయనమైనట్లు అమ్రుల్లా తెలిపారు.

పంజ్‌షేర్‌ వెళ్లే మార్గంలో కలిసి పోరాటం చేద్దామని, ఒకవేళ గాయపడితే తన తలలో రెండుసార్లు కాల్చాలని సైనికాధికారికి చెప్పినట్లు అమ్రుల్లా పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details