తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ హోటల్​పై విరుచుకుపడిన ఉగ్రమూకలు.. - ఉగ్రదాడి

పొరుగు దేశం పాకిస్థాన్​లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. బలూచిస్థాన్​లోని తీర పట్టణం గ్వాదర్​ లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్​పై దాడికి దిగారు. హోటల్హోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముష్కరులను అడ్డుకున్న సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి చంపేశారు. హోటల్​పై దాడి తమ పనేని ప్రకటించింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఉగ్రసంస్థ.

పాక్​ హోటల్​పై విరుచుకుపడిన ఉగ్రమూకలు

By

Published : May 11, 2019, 8:03 PM IST

Updated : May 12, 2019, 12:04 AM IST

పాకిస్థాన్​ బలూచిస్థాన్ ప్రాంతంలోని తీర పట్టణం గ్వాదర్​లో ఓ హోటల్​పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. సాయుధులుగా వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు హోటల్​లోకి చొచ్చుకెళ్లారు. నావిక, మిలటరీ అధికారులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. హోటళ్లోకి ముష్కరుల రాకను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపరేషన్ కొనసాగుతోంది.

"సాయంకాలం 4.50 నిమిషాలకు ముగ్గురు సాయుధులు పీయల్ కాంటినెంటల్ హోటల్​పై దాడికి దిగినట్లుగా సమాచారమందింది." -పోలీసుల ప్రకటన

విదేశీయులు సహా హోటళ్లో ఉన్న అందరినీ సురక్షితంగా బయటకు రప్పించినట్లు పాక్ సమాచార మంత్రి ప్రకటించారని ఓ న్యూస్ ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. పీయల్ కాంటినెంటల్ హోటల్లో ఎక్కువగా వ్యాపారవేత్తలు, విహారయాత్రకు వచ్చే పర్యటకులు బస చేస్తారు.

హోటల్​పై దాడి తమ పనేనని ప్రకటించింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఉగ్రసంస్థ. తమ సహచరుల మృతికి ప్రతీకారంగానే ఈ దాడి చేపట్టినట్లు ప్రకటించింది.

ఇదీ చూడండి: విజయోత్సాహంలో జారిపడ్డ దేశాధ్యక్షుడు

Last Updated : May 12, 2019, 12:04 AM IST

ABOUT THE AUTHOR

...view details