తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా- ఒక్కరోజే 2.44 లక్షల కేసులు

కరోనా ఉద్ధృతి రోజు రోజుకు తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 56 లక్షలు దాటింది. 24 గంటల వ్యవధిలో 2.44 లక్షల కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాలు 8.54 లక్షలకు చేరుకున్నాయి.

Global COVID-19 tracker
ప్రపంచంపై కరోనా పంజా- ఒక్కరోజే 2.44 లక్షల కేసులు

By

Published : Sep 1, 2020, 8:33 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 56 లక్షలకు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2,44,557 కేసులు నమోదయ్యాయి. మరో 4,221 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 8.54 లక్షలకు చేరుకున్నాయి.

ప్రస్తుతం 68 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా... కోలుకున్నవారి సంఖ్య కోటి 79 లక్షలు దాటింది.

  • అమెరికాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 38,560 మంది కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. 512 మంది మరణంతో మొత్తం మృతుల సంఖ్య లక్షా 87 వేలకు చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 62 లక్షలకు చేరుకుంది.
  • బ్రెజిల్​లో కేసులు 40 లక్షలకు చేరువయ్యాయి. కొత్తగా 48,590 మంది కరోనాబారినపడ్డారు. మరో 619 మంది మరణంతో కరోనా ధాటికి బలైన వారి సంఖ్య లక్షా 21 వేలకు చేరింది.
  • రష్యాలో కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. మరో 4,993 మందికి తాజాగా పాజిటివ్​గా తేలింది. 83 మంది మరణించారు.

వీటితో పాటు, పెరూ, దక్షిణాఫ్రికా, కొలంబియా, మెక్సికో, అర్జెంటీనా దేశాల్లో మహమ్మారి విలయతాండవం చేస్తోంది.

వివిధ దేశాల్లో కరోనా కేసుల వివరాలు

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 62,11,796 1,87,736
బ్రెజిల్​ 39,10,901 1,21,515
రష్యా 9,95,319 17,176
పెరూ 6,52,037 28,944
దక్షిణాఫ్రికా 6,27,041 14,149
కొలంబియా 6,15,168 19,663
మెక్సికో 5,95,841 64,158

ABOUT THE AUTHOR

...view details