కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 38 లక్షల 9 వేల 68 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం 8 లక్షల 17 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాధి బారినపడినవారిలో కోటి 63 లక్షల 58 వేల 236 మంది కోలుకున్నాారు.
వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో కేసుల సంఖ్య 59 లక్షల 15వేల 630కి చేరగా.. మరణాల సంఖ్య లక్ష 81 వేల 114కు పెరిగింది. బ్రెజిల్లో బాధితుల సంఖ్య 36 లక్షల 27 వేలు దాటింది.