ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనానికి కారణమవుతున్న అడ్డంకులను తొలగించాలని జీ-20 సదస్సు వేదికగా అగ్రనేతలు పిలుపునిచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా సుస్థిర ఆర్థిక విధానాలను పాటించాలని, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీఓ) సంస్కరణలకు కృషి చేయాలని ఉద్ఘాటించారు. అవినీతిపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పోరులో జీ20 ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
"ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగిస్తోంది. దీనితో రిస్క్ కూడా పెరుగుతోంది. ముఖ్యంగా దేశాల మధ్య వాణిజ్య పోరు, సరిహద్దు అనిశ్చితులే ఇందుకు ప్రధాన కారణం. ఈ అంశాలపై సమీక్షించి... వాటిని తగ్గించేందుకు తదుపరి చర్యలు తీసుకుంటాం."
---జీ20 సదస్సు ముగింపులో దేశాధినేతల ప్రకటన