తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్​లో 14వ జీ20 సదస్సు ప్రారంభం - ఒసాకా

14వ జీ20 సదస్సు ప్రారంభమైంది. జపాన్​లోని ఒసాకా నగరం ఈ సదస్సుకు ముస్తాబైంది. భారత ప్రధాని మోదీ సహా సభ్యదేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. శనివారం వరకు సదస్సు జరగనుంది.

జీ-20 సదస్సు

By

Published : Jun 28, 2019, 5:40 AM IST

Updated : Jun 28, 2019, 1:24 PM IST

జపాన్​లోని ఒసాకా వేదికగా నేడు 14వ జీ20 సదస్సు ప్రారంభమైంది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా సభ్యదేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సారి జీ20 సదస్సులో ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు, నవకల్పనలు, డిజిటల్​ ఎకానమి, కృత్రిమ మేధ, వాతావరణ మార్పులు, పర్యావరణ సంరక్షణ వంటి అంశాలపై దేశాధినేతలు చర్చించనున్నారు.

జపాన్​లో 14వ జీ20 సదస్సు ప్రారంభం

సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో పాటు పలు దేశాధ్యక్షులతో మోదీ సమావేశమవుతారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి భారతదేశ ప్రధానిగా ఎన్నికైన అనంతరం తొలిసారి ట్రంప్​తో మోదీ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహత్మక ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి.

అమెరికా- భారత్​ మధ్య నెలకొన్న 'సుంకాల' సమస్యల నేపథ్యంలో ట్రంప్​తో మోదీ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ సదస్సు శనివారం వరకు కొనసాగుతుంది.

ఇదీ చూడండి: జీ20 సదస్సు వేదికగా మోదీ- ట్రంప్​ భేటీ

Last Updated : Jun 28, 2019, 1:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details