మాల్దీవుల ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు నషీద్ నేతృత్వంలోని ఎండీపీ ఘనవిజయం సాధించింది.పలు అభియోగాలతో విదేశాల్లో ఉండి... దేశానికి తిరిగి వచ్చిన 5 నెలల్లోనే తిరిగి జాతీయ పార్లమెంట్లోకి నాటకీయంగా తిరిగొచ్చారు. 87 మంది ఉన్న అసెంబ్లీలో నషీద్ నేతృత్వంలోని మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ(ఎండీపీ) 60 సీట్లు దక్కించుకుంది.
మాల్దీవుల్లో పోలింగ్ శనివారం జరిగింది.