New Year in Space: ఈసారి కొత్త సంవత్సర వేడుకలు ఓ రికార్డును సృష్టించాయి. కానీ.. ఆ సంబరాలు జరిగింది భూమిపై కాదు.. అంతరిక్షంలో! అక్కడి రెండు స్పేస్ సెంటర్లలో విధుల్లో ఉన్న పది మంది వ్యోమగాములు.. న్యూ ఇయర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. స్పేస్‌లో ఒకేసారి ఇంతమంది ఈ వేడుకల్లో పాల్గొనడం మానవ అంతరిక్ష చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం. రష్యన్ స్పేస్ ఏజెన్సీ 'రోస్‌కాస్మోస్' శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. భూమికి సమీప కక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఏడుగురు, చైనాకు చెందిన తియాంగాంగ్‌లో ముగ్గురు.. మొత్తం పది మంది 2022 స్వాగత వేడుకలు చేసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
New Year in Space: అంతరిక్షంలో న్యూఇయర్ వేడుకల కొత్త రికార్డు - అంతరిక్షంలో కొత్త సంవత్సర వేడుకలు
New Year in Space: అంతరిక్షంలో నూతన సంవత్సర వేడుకలు సరికొత్త రికార్డును సృష్టించాయి. రెండు స్పేస్ సెంటర్లలో విధుల్లో ఉన్న పది మంది వ్యోమగాములు.. న్యూ ఇయర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. స్పేస్‌లో ఒకేసారి ఇంతమంది ఈ వేడుకల్లో పాల్గొనడం మానవ అంతరిక్ష చరిత్రలోనే ఇదే తొలిసారి.
రోస్‌కాస్మోస్ ప్రకారం.. గత 21 ఏళ్ల వ్యవధిలో 83 మంది వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వారిలో పలువురు అనేకసార్లు జనవరి 1 సమయంలో స్పేస్ స్టేషన్‌లోనే ఉన్నారు. రష్యన్ వ్యోమగామి అంటన్ ష్కప్లెరోవ్.. ఏకంగా నాలుగుసార్లు.. 2012, 2015, 2018, 2022 వేడుకల వేళ అక్కడే ఉండటం గమనార్హం. అంతరిక్షంలో నూతన సంవత్సరాన్ని జరుపుకొన్న మొదటి వ్యోమగాములు అప్పటి సోవియట్ యూనియన్‌కు చెందిన యూరి రోమనెంకో, జార్జి గ్రెచ్కో. 1977-1978లో వారు అక్కడే ఉన్నారు. ప్రస్తుతం తియాంగాంగ్‌లో ముగ్గురు, ఐఎస్‌ఎస్‌లో నలుగురు నాసా, ఇద్దరు రోస్‌కాస్మోస్, ఒకరు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగాములు ఉన్నారు. ఈ పది మందిలో నాసా ఆస్ట్రోనాట్, తెలుగు మూలాలున్న రాజాచారి ఒకరు.
ఇదీ చూడండి:ఏ దిక్కూలేని వారికి అండగా ప్రభుత్వం.. గొప్ప సంకల్పంతో..