తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆకట్టుకుంటున్నఅబుదాబిలోని హిందూ ఆలయం

యూఏఈలో నిర్మిస్తున్న చారిత్రాత్మక హిందూ ఆలయ తుది అంలకరణ దృశ్యాలను విడుదల చేశారు అధికారులు. భారత సంప్రదాయ పద్ధతిలో రూపుదిద్దుకుంటోన్న ఈ మందిర చిత్రాలు.. వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రవేశ ద్వారంలో ఏర్పాటుచేసిన జలపాతం, ఇతర కట్టడాలు వేటికవే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

First images of final design of Abu Dhabi's first Hindu temple released
యూఏఈ: ఆకట్టుకుంటోన్న అబుదాబి హిందూ ఆలయ దృశ్యాలు

By

Published : Nov 10, 2020, 6:09 PM IST

యూఏఈ రాజధాని అబుదాబిలో తొలిసారిగా రూపుదిద్దుకుంటోన్న హిందూ దేవాలయానికి సంబంధించిన చిత్రాలు విడుదలయ్యాయి. భారత సంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తోన్న ఈ ఆలయంలో హిందూ పురాణాలు, గ్రంథాలు వంటి అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. మన దేశ తరహాలోనే చేతితో చెక్కిన రాతి స్తంభాలను ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత దృశ్యాలను విడుదల చేశారు బోచాసాన్వి శ్రీ అక్షర్​ పురుషోత్తమ్​ స్వామినారాయణ్​ సంస్థాన్(బీఏపీఎస్​)​ అధికార ప్రతినిధి అశోక్​ కొటెచా.

చేతితో చెక్కిన రాతి స్తంభాలు

ఈ ఆలయ నిర్మాణం కోసం రాజస్థాన్, గుజరాత్​లలో తయారైన ప్రత్యేక శిలలను ఉపయోగిస్తున్నారు. ఆలయ వెలుపలి భాగంలో గ్రంథాలయం, తరగతి గది, సమావేశ భవనాలను నిర్మించనున్నారు.ప్రవేశ ద్వారంలో ఏర్పాటు చేసిన జలపాతం, ఆలయం చుట్టూ ప్రత్యేకంగా రూపొందించిన నీటి వనరుల దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

భారత్​, యూఏఈల మార్గనిర్దేశంతో..

చారిత్రాత్మకమైన ఈ ఆలయం.. భారత్​, యూఏఈల మార్గనిర్దేశం ప్రకారం నిర్మిస్తున్నారు అధికారులు. ఈ హిందూ పుణ్యక్షేత్రం కోసం గతేడాది ఏప్రిల్​లో పునాదులు పడగా.. అదే సంవత్సరం డిసెంబర్​ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించారు. మందిరానికి సంబంధించిన మాస్టర్​ ప్లాన్​ రూపకల్పన ఈ ఏడాది ఆరంభంలోనే పూర్తయింది. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా నిర్మాణ పనులు మరింత ఆలస్యమవుతున్నాయి.

ఈ ఆలయంలో కథలు, శిల్పాలు భారత భౌగోళిక, హిందూ విశ్వాసాలకు తగినట్టుగా ఉంటాయన్నారు అశోక్​. ఇందులో మహాభారతం, రామాయణం వంటి పురాణాలు, ప్రాంతీయ చరిత్రలనూ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

మందిర నిర్మాణం కోసం రాతి పనులు భారత్​లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్​ ఇసుకరాయి, ఇటాలియన్​ కెరానా మార్బుల్​తో శిల్పాలను రూపొందిస్తున్నారు.

యూఏఈలో ఉన్న 30 లక్షల మంది భారతీయులు సహా.. పర్యటకుల కోసం ఈ ఆలయం ముస్తాబవుతోంది.

ఇదీ చూడండి:'మిస్​ యూఎస్​'గా నిలిచిన అస్యా బ్రాంచ్

ABOUT THE AUTHOR

...view details