కరోనా మహమ్మారి విజృంభణను అరికట్టేందుకు తీసుకునే చర్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్ ప్రధాని యొషిహిదె సుగాతో చర్చలు జరిపారు. అంతేకాకుండా.. ఉన్నత సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, ద్వైపాక్షిక సంబంధాల పురోగతి వంటి అంశాలపైనా సుగాతో ఫోన్లో సంభాషించినట్టు ట్విట్టర్లో తెలిపారు మోదీ.
"జపాన్ ప్రధాని సుగాతో ఫోన్లో మాట్లాడాను. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక అంశాల పురోగతిపై సమీక్షించాం. కరోనా వైరస్‌పై కలిసి పోరాడటం సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారం గురించి కూడా చర్చించాం."