తెలంగాణ

telangana

ETV Bharat / international

సీపాస్​.. యాంటీబాడీలను గుర్తించే సరికొత్త కిట్‌! - యాంటీ బాడీలు గుర్తించే సీపాస్ కిట్

కరోనా వైరస్​ యాంటీబాడీలను గుర్తించేందుకు సింగపూర్​ పరిశోధకులు ఓ సరికొత్త కిట్​ను రూపొందించారు. దీనికి 'సీపాస్' అనే పేరు పెట్టారు. ఈ కిట్​ కాంటాక్ట్​ ట్రేసింగ్​, వ్యాక్సిన్​ పనితీరు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

FDA_Singapore kit
సీపాస్​:యాంటీబాడీలను గుర్తించే సరికొత్త కిట్‌!

By

Published : Nov 10, 2020, 5:27 AM IST

కరోనా వైరస్‌ నిర్ధరణతోపాటు యాంటీబాడీలను వేగంగా గుర్తిచేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలను తెలుసుకోవడమే కాకుండా వైరస్‌ను తటస్థీకరించే సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సింగపూర్‌ పరిశోధకులు ఓ ప్రత్యేక కిట్‌ను రూపొందించారు. 'సీపాస్'‌ పేరుతో పిలిచే ఈ కిట్‌కు తాజాగా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి కూడా లభించింది. ఈ విషయాన్ని ఎఫ్‌డీఏ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మానవుల్లో కరోనా వైరస్‌ తటస్థీకరణ సామర్థ్యాన్ని అంచనా వేసే తొలి కిట్‌ కూడా ఇదే కావడం విశేషం.

కాంటాక్ట్ ట్రేసింగ్​లోనూ...

సెరోలజీ యాంటీబాడీ టెస్ట్‌ ద్వారా ఇదివరకే తమకు వైరస్‌ సోకిందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునే వీలుంటుంది. ఇలా ఇప్పటికే అత్యవసర వినియోగం కింద 50కిపైగా సెరోలజీ టెస్టులకు ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. అయితే, అవి కేవలం ఇది వరకు నిరోధించిన యాంటీబాడీల ఉనికిని మాత్రమే గుర్తిస్తాయి. ఈ ప్రతిరక్షకాలు వైరస్‌ వ్యాప్తిని ఎంతవరకు అడ్డుకుంటాయని మాత్రం కచ్చితంగా అంచనా వేయలేవు.

తాజాగా రూపొందించిన ఈ కిట్‌ ద్వారా యాంటీబాడీలు వైరస్‌ను తటస్థీకరించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేయగలుగుతాయని ఎఫ్‌డీఏ పేర్కొంది. అంతేకాకుండా వ్యాక్సిన్లు పనిచేస్తాయో? లేదో? తెలుసుకోవడం, జనాభాలో ఎంతమందికి వైరస్‌ పోకిందనే విషయాన్ని కనుక్కోవడం సహా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌లోనూ ఈ కిట్‌ ఎంతగానో దోహదపడుతుందని దీన్ని అభివృద్ధి చేసిన సింగపూర్‌ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వీటి ఫలితం కూడా కేవలం గంటలోనే వస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:20 రోజుల్లో ఐదు సార్లు మోదీ- జిన్​పింగ్ భేటీ

ABOUT THE AUTHOR

...view details