తెలంగాణ

telangana

ETV Bharat / international

గ్రే లిస్ట్​లోనే పాక్- వచ్చే ఏడాది బ్లాక్​ లిస్ట్​లో చేరిక! - తీవ్ర హెచ్చరికలు

పాకిస్థాన్​ను గ్రే లిస్ట్​లో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్​ఏటీఏఫ్​). అయితే తాము నిర్దేశించిన సూచనలను త్వరగా అమలు చేయాలని.. లేకపోతే బ్లాక్​ లిస్ట్​లోకి చేర్చడం తథ్యమని తేల్చిచెప్పింది.

ఉగ్రవాదంపై పాక్​కు ఎఫ్​ఏటీఎఫ్​ డెడ్​లైన్​!

By

Published : Oct 18, 2019, 2:50 PM IST

Updated : Oct 18, 2019, 6:42 PM IST

గ్రే లిస్ట్​లోనే పాక్- వచ్చే ఏడాది బ్లాక్​ లిస్ట్​లో చేరిక!

పాకిస్థాన్​కు ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్​ఏటీఎఫ్​) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పాక్​ను గ్రే జాబితాలో కొనసాగిస్తూనే... ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, మనీలాండరింగ్​ వంటి నేరాలను పూర్తిగా నియంత్రించాలని తేల్చిచెప్పింది. కనీసం స్థిరమైన పురోగతి సాధించాలని లేదా బ్లాక్​ లిస్ట్​లో చేర్చడం తప్పదని స్పష్టం చేసింది.

ఎఫ్​ఏటీఎఫ్​ ప్లీనరీ ఐదురోజుల పాటు పారిస్​లో జరిగింది. ఈ సమావేశంలోనే పాక్​ను హెచ్చరించింది ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ.

నిర్దేశించిన 27 అంశాల్లో పాకిస్థాన్​ కేవలం ఆరు మాత్రమే పూర్తి చేసిందని ఎఫ్​ఏటీఎఫ్ సమీక్షలో తేలింది. ఆగ్రహించిన ఎఫ్​ఏటీఎఫ్​... ఫిబ్రవరి 2020లోగా పాక్​పై కఠిన చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆర్థిక సంస్థలకు సూచించింది.

2020లో పాకిస్థాన్​ను బ్లాక్​ లిస్ట్​లో చేర్చడం ఖాయమని ఎఫ్​ఏటీఎఫ్​ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్రంగా సతమతమవుతున్న పాక్​​.. ఎఫ్​ఏటీఎఫ్​ చర్యలతో సంక్షోభంలో కూరుకుపోయే అవకాశముంది.

ఇదీ చూడండి:-పాపాల పాకిస్థాన్​కు ఎఫ్​ఏటీఎఫ్​ 'బ్లాక్​లిస్ట్'​ ముప్పు!

Last Updated : Oct 18, 2019, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details